పౌల్ట్రీ వ్యాక్సినేషన్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

19 Aug 2021 06:46 PM Comment(s) By Aqgromalin Team

జీవాల పెంపకం (లైవ్‌స్టాక్) రంగంలోని పౌల్ట్రీ విభాగం అనేది భారతదేశపు వ్యవసాయ రంగంలో ఒక అమూల్యమైనదిగా పరిగణించబడుతోంది. జీవనోపాధి కోసం ఒక ముఖ్యమైన

వనరుగా ఉంటోన్న ఈ విభాగం గ్రామీణ ప్రాంతాల్లోని అసంఖ్యాకమైన కుటుంబాలకు మద్దతు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా అందిస్తోంది. చాలామంది విషయంలో, ఇతర జీవాల పెంపకంలో మరియు వ్యవసాయంలో రాబడి తగ్గినప్పుడు ఇదొక అనుబంధ ఆదాయ వనరుగా ఉంటోంది. 


Poultry Vaccination All you need to know

 

పెద్ద ఎత్తున సాగుతున్న కోళ్ల పెంపకం అనేది ప్రతి సంవత్సరం దాదాపు 6% వృద్ధిని నమోదు చేయడం ద్వారా, భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు మద్దతు అందిస్తోంది. ప్రస్తుతం, రూ. 1 లక్ష కోట్లు లేదా 15.38 బిలియన్‌ అమెరికా డాలర్ల విలువ కలిగిన ఈ రంగం,2024 నాటికి రూ. 4,340 బిలియన్‌ల స్థాయికి చేరేలా ముందుకు సాగుతోంది. ఈ స్థాయి వేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమ ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఇదే వృద్ధిని కొనసాగించాలంటే, సురక్షితమైన అంశాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.Poultry Vaccination All you need to know


ఓవైపు ఉత్పాదకత పెంచుతూ, మరోవైపు నష్టాలు తగ్గించాలంటే,వ్యాధుల వల్ల కలిగే అనారోగ్యం మరియు మరణాలు లేకుండా చూడడమనేది అత్యంత ప్రభావవంతమైన అంశంగా ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో కోళ్ల ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ, వ్యాధి నిర్మూలన చేయడం అవసరం. పరిశోధన మరియు వ్యాక్సిన్ అభివృద్ధితో ఇది సాధ్యమవుతుంది. 


వ్యాక్సినేషన్ అంటే ఏమిటి?

జీవ భద్రతకు వ్యాక్సినేషన్ ఒక కీలక అంశం. కోళ్ల ఫామ్‌లన్నింటినీ ఒకేసారి సర్వనాశనం చేయగల ప్రాణాంతక వ్యాధుల నిరోధానికి ఇదొక సాధనం. పరాన్నజీవులు, ప్రోటోజోవాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు వైరస్ లాంటి అనేక సూక్ష్మజీవులు వ్యాధులకు కారణమవుతుంటాయి. అయితే, ఈ సూక్ష్మజీవుల మీద పోరాటం కోసం ఔషధాలున్నాయి. బ్యాక్టీరియా మీద దాడి కోసం యాంటీబయాటిక్‌లు ఉన్నాయి. అయితే, వైరస్ వ్యాధుల కోసం అలాంటి ఔషధాలేవీ లేవు;దీనికి పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమే.


పౌల్ట్రీ పరిశ్రమలో అంటువ్యాధులుగా విజృంభించే వైరల్ వ్యాధులను నిరోధించడానికి మరియు నియంత్రించడానికి పౌల్ట్రీ రంగంలో వ్యాక్సిన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పౌల్ట్రీలో పారిశుధ్యంతో పాటు, ఫామ్ స్థాయిలో వైద్య సంబంధిత వ్యాధులను నిరోధించడం లేదా తగ్గించడం కోసం ఇన్ఫెక్షన్ సోకడానికి ముందే వ్యాక్సిన్లు ఉపయోగిస్తారు. ఫలితంగా, ఉత్పత్తి పెరుగుతుంది.

ఇందులో భాగంగా, గుడ్లు పెట్టే కోళ్లు వాణిజ్య వ్యవస్థలోకి ప్రవేశించడానికి ముందు అవి పుట్టిన పిల్లలుగా ఉన్నప్పుడే వాటికి వ్యాక్సిన్లు వేయాలి.

Aqaiలో, మా పౌల్ట్రీ కోళ్లలో రోగనిరోధక శక్తి నిర్ధారించే విషయంలో మేము చాలా శ్రద్ధ వహిస్తాము. కోళ్లలో వ్యాధికారక సూక్ష్మజీవులను క్రియారహితం చేసి మరియు అవి ఉత్పాదకంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేసే ప్రతిరోధకాలు వాటిలో వృద్ధి చెందేలా నిర్ధారించడం కోసం మేము ప్రతి రకానికి అత్యంత శ్రద్ధతో వ్యాక్సిన్లు వేస్తాము.

మా ధృవీకరణ కలిగిన ఫామ్‌లు, మౌలిక సదుపాయాలు మరియు కార్యకలాపాల గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి. 


To know more about our certified farms, infrastructure and operations, click here 

Get it on App Store
Get it on Play store
Share -
Added to cart
Your cart has item(s).
- Can't add this product to the cart now. Please try again later.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.